![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -375 లో... కళ్యాణ్ దగ్గరికి కావ్య వచ్చి.. ఒక హెల్ప్ చేయమని అడుగుతుంది. ఒక ఇన్ఫర్మేషన్ కావాలి.. మీ అన్నయ్యకి తెలిసిన వాళ్లలో ఎవరైనా వెన్నెల అనే పేరు గల వాళ్ళు ఉన్నారా అని అడుగుతుంది. నాకు తెలిసి ఎవరు లేరని కళ్యాణ్ అంటాడు. బాగా గుర్తుకుతెచ్చుకోండి బాబు తల్లి ఎవరని అడిగితే.. వెన్నెల అని మీ అన్నయ్య చెప్పాడు.. అందుకే బాగా గుర్తుకు తెచ్చుకోండని కళ్యాణ్ తో కావ్య అంటుంది.
ఆ తర్వాత కళ్యాణ్ బాగా గుర్తుకుచేసుకుని.. మా అన్నయ్య టెన్త్ క్లాస్ ఫ్రెండ్ వెన్నెల.. తను మా అన్నయ్యని ప్రేమించిందని తెలుసని కళ్యాణ్ చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో కనుక్కొని కావ్య వెళ్తుంది. మరొకవైపు అప్పు ఆ బ్రోకర్ అన్న మాటలు గుర్తుకుచేసుకొని తన గదిలో డోర్ పెట్టుకొని ఏడుస్తుంది. కనకం ఎంత పిలిచిన డోర్ తియ్యదు.. అప్పు ఎన్ని సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చెయ్యకపోవడంతో కళ్యాణ్ డైరెక్ట్ గా ఇంటికి వస్తాడు. కళ్యాణ్ డోర్ తియ్యమని అన్నా కూడా అప్పు తియ్యదు. నువ్వు డోర్ తీసేవరకు ఇక్కడ నుండి నేను కదలనని కళ్యాణ్ అనగానే.. అప్పు డోర్ తీస్తుంది. అప్పు బయటకి వచ్చి కళ్యాణ్ చేతిని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావని కళ్యాణ్ అడుగుతాడు. ఆ బ్రోకర్ అన్న మాటలు చెప్పగానే వాని సంగతి చెప్తానంటూ అప్పు చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తాడు. మరొకవైపు రాజ్ చదువుకున్న స్కూల్ కి కావ్య వెళ్లి అక్కడ సర్ తో మాట్లాడి.. రాజ్ వాళ్ళ బ్యాచ్ లో వెన్నెల అనే అమ్మాయి అడ్రెస్ కావాలనగానే చూసి చెప్తానని అంటాడు. ఆ తర్వాత కావ్య కూడా ఫైల్స్ చూస్తుంటే వెన్నెల అనే అమ్మాయి ఉంటుంది. ఇక ఆ వివరాలని తీసుకొని కావ్య వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత వెన్నెల అడ్రస్ కనుక్కొని వాళ్ళింటికి వెళ్తుంది. మర్యాదగా మా ఇంటికి వచ్చి నీ గురించి చెప్పని కావ్య అనగానే.. మీరు ఎవరు అనుకుని వచ్చారో నా పేరు సావిత్రి అని ఆవిడ చెప్తుంది. అయ్యో సారీ అంటు కావ్య వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నా వల్లే కళ్యాణ్ కి ఆ పదవి వచ్చిందని అనామిక, ధాన్యలక్ష్మిలకు రుద్రాణి చెప్తుంది. మరొకవైపు అప్పుని కళ్యాణ్ తీసుకొని వెళ్ళి ఆ బ్రోకర్ ని కలిసి కొడుతాడు. అక్కడే మీడియా పోలీసులు ఉంటారు. వాళ్ళతో కూడా జరిగింది మొత్తం కళ్యాణ్ చెప్తాడు. తరువాయి భాగంలో మళ్ళీ మళ్ళీ అప్పు కళ్యాణ్ ని ఎందుకు కలుస్తుందంటూ ధాన్యలక్ష్మి అంటుంది. కనకం ఫ్యామిలీ ఈ కుటుంబంతో ఎలాంటి సంబంధం పెట్టుకోవద్దని ధటన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |